భార్య, ఏడు నెలల పసి పాపను సుత్తితో కొట్టి చంపిన దుర్మార్గుడు

الجمعة، 31 يوليو 2026

Ballari city crime Driven by suspicion about his wife karnataka Man brutally kills wife and seven-month-old infant with a hammer over suspicions

t f B! P L

ర్ణాటకలోని బళ్లారి నగరంలో కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే సందేహంతో సుత్తితో తీవ్రంగా బాది భార్యను, కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హొన్నూరప్ప, రాజేశ్వరిలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎపిఎమ్‌సి యార్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రాళ్ గ్రామంలోని వారి నివాసంలో గురువారం రాత్రి 8:30 నుండి 9:30 గంటల మధ్య ఈ ఘాతుకం జరిగింది. ఇంట్లో ఉన్న సమయంలో హొన్నూరప్ప సుత్తితో భార్య, పసిపాప తలలపై తీవ్రంగా కొట్టడంతో వారు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్వరి సోదరుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భార్య ప్రవర్తనపై ఉన్న అనుమానంతో పాటు, చిన్న కుమార్తె తన రక్తానికి పుట్టలేదనే భావనతోనే హొన్నూరప్ప ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. బళ్లారి ఎస్పీ సుమన్ డి పెన్నేకర్ మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, భారతీయ నష్య సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణను వేగవంతం చేసి, నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా సాధ్యమైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ