ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ నాగలూటి - ఆత్మకూరు రేంజ్ ల సరిహద్దు ఇసుక గుండం పరిసరాల్లో టైగర్ ట్రాకర్లు ఫుట్ పెట్రోలింగ్ చేస్తుండగా పెద్దపులి కళేబరం కంటపడింది. పెద్దపులి మృతి చెంది 72 గంటలు దాటిన మానవాళ్ళు కనిపించాయి. మరోవైపు అనుమానస్పదాలు రేకెత్తిస్తున్నాయి. పెద్దపులి దేహం పై ఉండే చారలను బట్టి టి. 66 ఆడపులిగా శ్రీశైలం బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీ కి తరలించారు. ఇదిలా ఉంటే ఆసియాలోనే అతిపెద్ద విస్తీర్ణం కలిగిన పెద్ద పులుల అభయారణ్యం నల్లమల లోని నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వు. సహజ వాతావరణం లో పెద్ద పులుల సంతతి గణనీయంగా పెరుగుతూ ఈ ఏడాదికి సుమారు 100 పెద్ద పులులు ఉండవచ్చని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రాథమిక అంచనా. ఆత్మకూరు అటవీ డివిజన్లో పెద్దపులి మృతి చెందడం ఆ శాఖలో భయాందోళనలు సృష్టించింది. గత 15 సంవత్సరాలుగా ఈ డివిజన్లో పెద్ద పులుల మృతి సంఘటనలు అనుమానస్పదంగా మారడంతో కేంద్ర ఎన్ టి సి ఏ సీరియస్ అయ్యింది. దర్యాప్తులో వాస్తవాలు బయటకు రాకుండా అధికారులు దాచారనే విమర్శలు లేకపోలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పెద్ద పులులు ఎన్ని మృత్యువాత పడ్డాయో గణాంకాలను వెల్లడించే కేంద్ర అటవీ, పర్యావరణ, ఎంటీ సీఏ సంస్థలు నల్లమల ఎన్ ఎస్ టి ఆర్ లో మృత్యువాత పడుతున్న పెద్ద పులుల గణాంకాలను ఎందుకు వెల్లడించడం లేదని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం నాడే ఆత్మకూరు నల్లమలలో ఆడ పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆవేదన కలిగిస్తుందని పర్యావరణ సంరక్షకులు అన్నారు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పెద్దపులి
الخميس، 30 يوليو 2026
Andhra Pradesh Atmakur Wildlife Forest Division Isuka Gundam Nandyal district national Tiger Found Dead Under Suspicious Circumstances
ليست هناك تعليقات:
إرسال تعليق