టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, క్లాసిక్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. తన 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ గురువారం సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో ద్వారా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. జీవితంలో సరైన సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగక తప్పదని ఈ సందర్భంగా అతడు ఉద్వేగభరితంగా పేర్కొన్నాడు. తనకు అండగా నిలిచిన బీసీసీఐకి, తన తోటి ఆటగాళ్లకు, కోచ్‌లకు, కోట్లాది మంది అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. 2011లో ఇంగ్లండ్‌పై టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రహానే, ఆ తర్వాత కొన్ని రోజులకే రాహుల్ ద్రావిడ్ ఫేర్‌వెల్ సిరీస్‌లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2013లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లీ, పుజారాలతో కలిసి మిడిలార్డర్‌లో భారత జట్టుకు బలమైన వెన్నెముకగా నిలిచాడు. కఠినమైన విదేశీ పిచ్‌లపై అతడు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై !
الخميس، 30 يوليو 2026
Ajinkya Rahane Bids Adieu to International Cricket emotional video on social media He expressed heartfelt gratitude to the BCCI national sports
ليست هناك تعليقات:
إرسال تعليق