ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం జిల్లా కూనవరం మండలం కొత్త కర్మన్ కొండ గ్రామానికి చెందిన సుట్రూ లక్ష్మణ్ రెడ్డి కుమార్తె సమ్మక్క ప్రియా సోమవారం పాము కాటుకు గురైంది. పాము కాటుకు గురైన తన కూతురును డోలి ద్వారా నాలుగు కొండలు ఎక్కి దిగి కుటూరు ప్రాథమిక వైద్యశాలకు తీసుకు రావడం జరిగింది. వైద్య సిబ్బంది పాముకాటుకు గురైన వ్యక్తికి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. చింతూరు ఏజెన్సీలో కొండరెడ్ల కుటుంబాలకు డోలి మోత కష్టాలు తప్పడం లేదు. గుట్టల పై నివసిస్తున్న కొండ రెడ్లకు ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే క్షతగాతులను డోలి ద్వారా ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించడం జరుగుతుంది.
పాము కాటుకు గురైన బాలిక : డోలిలో ఆస్పత్రికి తరలింపు
الاثنين، 6 يوليو 2026
Andhra Pradesh Girl Bitten by Snake her condition is currently stable Kotha Karman Konda village Kunavaram Mandal Polavaram district Transported to Hospital via Doli
ليست هناك تعليقات:
إرسال تعليق