3,000కు చేరిన వెనిజులా భూకంప మృతుల సంఖ్య : వారం రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం

الأحد، 5 يوليو 2026

000 Government Declares Week-Long National Mourning international operations have ceased in many areas still underway Venezuela Earthquake Death Toll Reaches 3

t f B! P L

వెనిజులా రెండు వరుస భూకంపాల వల్ల దాదాపు 3,000 మంది మరణించారు. ఇప్పటికే 2,954 మందికిపైగా మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికితీశాయి. మరోవైపు సహాయక చర్యలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. గత జూన్ 24న వెనిజులాలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. దక్షిణ కరాకస్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో ఒక భూకంపం, 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించాయి. దీంతో అనేక బిల్డింగులు సహా నిర్మాణాలు నేలకూలాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 2,954 మంది మరణించారు. దాదాపు 16,500 మంది గాయపడ్డారు. ఇంకా బాధితుల వెలికితీత, శిథిలాల తొలగింపు వంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ చాలా చోట్ల సహాయక చర్యలు ఆగిపోయాయి. అలాగే వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన సహాయక బృందాలు తమ సహాయక చర్యల్ని ఆపేస్తున్నాయి. వెనిజులా వీడేందుకు సిద్ధమయ్యాయి. భూకంపం సంభవించిన తర్వాత మొదటి 72 గంటల రెస్క్యూ విండో పీరియడ్ చాలా కీలకం. ఈ సమయంలో చేపట్టే రెస్క్యూ ఆపరేషన్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుందని అంచనా. 72 గంటల్లో ఎక్కువ మందిని బతికించడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తాయి. అయితే, భూకంపం సంభవించి దాదాపు తొమ్మిది రోజులు కావడంతో సహాయక చర్యల్ని నెమ్మదిగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో బాధితులు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ. అందుకే కొన్ని సహాయక బృందాలు తమ ఆపరేషన్స్ నిలిపివేశాయి.  ఇంకా కొన్ని చోట్ల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ శిథిలాల కింద నుంచి ఒకరిద్దరు ప్రాణాలతో బయటపడుతున్న ఘటనలున్నాయి. వేల మంది క్షతగాత్రుల్ని అధికారులు స్తానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా వేలమంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం.. 50,000 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. భారీ ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో వెనిజులా ప్రభుత్వం వారం రోజులపాటు భూకంప మృతులకు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక, భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ 942సార్లు భూప్రకంపనలు వచ్చాయని అక్కడి అధికారులు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ