ఇరాక్‌లో మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ.475 కోట్ల నగదు, బంగారు బిస్కెట్లు, బంగారంతో తయారు చేసిన లో దుస్తులు పట్టివేత

الخميس، 2 يوليو 2026

Gold Bars Gold-Made Undergarments from Iraqi Female MP's Home international Operation Dawn Crackdown Seizure of ₹475 Crore Cash

t f B! P L

ఇరాక్‌లో కూరుకుపోయిన అవినీతిపై అక్కడి ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్ పేరుతో జరిగిన భారీ దాడుల్లో సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిగాయి. లీడర్ల ఇళ్లలో దొరికిన మిలియన్ల కొద్దీ డాలర్లు, గుట్టలుగా పడి ఉన్న బంగారం, కళ్లు చెదిరే విలాసవంతమైన వస్తువులు చూసి యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది! ఈ దాడుల్లో 27 వందల కోట్ల నగదు, వందల కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 67 మందికి పైగా అవినీతి అధికారులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులను అరెస్ట్‌ చేశారు. ఈ దాడుల్లో వెలుగు చూసిన కొన్ని నమ్మలేని నిజాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో ఏకంగా రూ.475 కోట్ల నగదుతో పాటు, స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అంతేకాదు ఆమె ఇంట్లో ఏకంగా ‘బంగారంతో తయారు చేసిన లో దుస్తులు’ లభించాయంటూ కొన్ని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆ ఎంపీపై, అక్కడి రాజకీయ వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఎంపీ ఆలియా నాసిఫ్, ఆమె కుమారుడిని అరెస్టు చేసిన అధికారులు వారి నివాసం నుండి సుమారు 15.5 మిలియన్ల అమెరికన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ బిగ్‌ ఆపరేషన్‌ సాధారణ పోలీసుల వల్ల కాదని, ప్రభుత్వం వ్యూహాత్మకంగా దేశంలోని అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ ను రంగంలోకి దించింది. అరెస్ట్ కాబోతున్న వారు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నేతలు కావడంతో వారు సాధారణ పోలీసులపై దాడులకు దిగే అవకాశం, లంచాలు ఇచ్చి తప్పించుకునే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం దేశంలోని అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ ను రంగంలోకి దించింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాక్ లాంటి దేశంలో నేతలు మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారాన్ని ఇళ్లలో కుప్పలుగా దాచుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ