శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2026' బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

السبت، 18 يوليو 2026

china impose tariffs of up to 100% on nations that import fuel from Russia international national Slovakia such as India US Senate Approves 'Sanctioning Russia Act of 2026' Bill

t f B! P L

రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తున్న దేశాలను కట్టడి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన 'శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2026' బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. మొత్తంగా 60 మంది సెనేటర్లు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బిల్లుకు అండగా నిలవడంతో ఆగస్టు నెలాఖరులోపు ఇది చట్టంగా మారనుంది. బిల్లు చట్టరూపం దాలిస్తే.. రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే భారత్, చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్ దేశాలపై అమెరికా 100% వరకు సుంకాలను విధించనుంది. రష్యా చమురు ఎగుమతుల్లో సుమారు 36% వాటాతో, చైనా తర్వాత రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న భారత్ గత నెలలోనే రూ. 4.05 లక్షల కోట్ల విలువైన చమురును దిగుమతి చేసుకుంది. ఆయిల్ కొనే దేశాలకు రష్యాతో వ్యాపారాన్ని ఆర్థికంగా నష్టదాయకంగా మార్చడం ద్వారా ఆంక్షల ప్రభావాన్ని పెంచాలని అమెరికా సెనేటర్లు భావిస్తున్నారు. భారత్, చైనా సహా 5 దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థికంగా సహకరిస్తున్నాయని.. కొత్త చట్టంతో దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లులో భారత్‌కు కొంత ఊరటనిచ్చే అంశం కూడా ఉంది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంక్షల నుంచి ఏదైనా దేశానికి మినహాయింపు ఇచ్చే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంది. అయితే, అలా మినహాయింపు ఇవ్వాలంటే అధ్యక్షుడు కాంగ్రెస్‌కు బలమైన కారణాలను వివరించాల్సి ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ