ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. కేంద్రం కీలక బిల్లులను సభ లో ప్రవేశ పెడుతున్న వేళ పార్టీ వైఖరిని స్పష్టం చేసారు. కేంద్రం తీసుకొచ్చే బిల్లులకు మద్దతు గా నిలవాలని సూచించారు. ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు వంటి అంశాల పైన చర్చించాలని ఎంపీల కు నిర్దేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైనా ప్రస్తావించారు. ప్రభుత్వ పని తీరు పైన ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, గాడి తప్పుతున్న కొందరు నాయకుల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తెలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాంటి వారిని దారిలో పెడతామని చెప్పారు. కొందరు అధికారులు తేడాగా వ్యవహరిస్తున్నారని, వారినీ సెట్ రైట్ చేస్తానని చెప్పుకొచ్చారు. గతంలోనే గాడి తప్పిన వారిని హెచ్చరిక చేసామని చంద్రబాబు గుర్తు చేసారు. వాళ్లతో పాటే అందరినీ ముంచుతామంటే సహించనని స్పష్టం చేసారు. 1999 లో అలాంటి వారిని వదులు కున్నాక ప్రజలు మళ్లీ గెలిపించారని చెప్పారు. వివాదాలకు అతీతంగా ఉండే వాళ్లే గెలుస్తారని వ్యాఖ్యానించారు. ఎంపీలు, ఎమ్మెల్యే లు సమన్వయం తో ఉండాలని సూచించారు. మంచి కోసం. చెబుతుంటే కొందరు.ఎమ్మెల్యే లు బయట కామెంట్ చేస్తున్నారని కొందరు సమావేశంలో ప్రస్తావన చేసారు. ఇలాంటివి తప్పవని చెప్పిన చంద్రబాబు.. తనను కూడా చాటున తిట్టుకునే వళ్లు ఉంటారని ..అవన్నీ తప్పవని చెప్పుకొచ్చారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ, క్యాడర్ ను అర్దం చేసుకుని ముందుకు వెళ్తేనే నాయకులుగా ఎదుగుతామని పేర్కొన్నారు.
గాడి తప్పిన వారిని వదులుకోవడానికి సిద్దం : పార్టీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు
السبت، 18 يوليو 2026
Andhra Pradesh Chandrababu at party MPs' meeting clarified the party's stance as the Centre prepares to introduce key bills in the House Ready to part ways with those who have gone off track
ليست هناك تعليقات:
إرسال تعليق