జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కాయి. టీమ్ ఈవెంట్‌లో ఎలావెనిల్ వలరివన్, సోనం ఉత్తమ్ మాస్కర్, విదర్శ వినోద్ రజతం సాధించగా, వ్యక్తిగత విభాగంలోనూ వలరివన్ మరో సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒకే రోజు రెండు రజత పతకాలు సాధించిన ఎలావెనిల్ వలరివన్‌ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. భారత షూటర్లు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొంటూ ఎలావెనిల్ సాధించిన రెండో పతకం ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు. టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించిన వలరివన్, సోనం ఉత్తమ్ మాస్కర్, విదర్శ వినోద్‌లను కూడా ప్రధాని అభినందించారు. వారి కృషి, టీమ్‌వర్క్ అద్భుత ఫలితాన్ని అందించాయని పేర్కొన్నారు.
ఆసియా క్రీడలు: రెండు రజత పతకాలను సాధించిన భారత షూటర్లు : ఎక్స్ వేదికగా అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ
الأحد، 20 سبتمبر 2026
Asian Games Indian Shooters Win Two Silver Medals national PM Narendra Modi Congratulates Them on X sports
ليست هناك تعليقات:
إرسال تعليق