మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఛార్జీలను భారీగా పెంచింది. దాదాపు 13.56 శాతం మేర టికెట్ ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల డీజిల్ ధరలు మండిపోతుండటం, స్పేర్ పార్ట్స్, టైర్ల ఖర్చులు పెరగడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడకుండా సాధారణ బస్సులకు మాత్రమే 13.56 శాతం మేర ధరలను పెంచినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మిగిలిన లగ్జరీ, ఏసీ సర్వీసులకు వేర్వేరుగా ధరలను సవరించారు. కొత్త నిబంధనల ప్రకారం ఆర్డినరీ బస్సులకు ప్రతి స్టేజీకి రూ.11.40, సెమీ లగ్జరీ బస్సులకు ప్రతి స్టేజీకి రూ.13.65, ఆర్డినరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులకు రూ.15.50, పూర్తి స్లీపర్ బస్సులకు రూ.16.75, ప్రీమియం సర్వీసులైన శివశాహి ఏసీ సీటర్, స్లీపర్‌లకు వరుసగా రూ.14.20, రూ.15.35 గా.. శివనేరి ఏసీ సీటర్, స్లీపర్ బస్సులకు వరుసగా రూ.21.25, రూ.25.35 గా ప్రతి స్టేజీకి ధరలను ఖరారు చేశారు. రోజుకు దాదాపు 55 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ, 14 వేలకు పైగా బస్సులతో దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థలలో ఒకటిగా ఉన్న మహారాష్ట్ర ఆర్టీసీని ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సమర్థించుకున్నారు.
బస్సు ఛార్జీలను భారీగా పెంచిన మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్
السبت، 18 يوليو 2026
hike of approximately 13.56 percent in ticket prices Maharashtra State Road Transport Corporation Hikes Bus Fares Significantly national
ليست هناك تعليقات:
إرسال تعليق