చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న “ఫేస్ రెంటల్” ట్రెండ్

الأحد، 20 سبتمبر 2026

AI-generated virtual characters are increasingly being used instead of real actors in AI advertisements and video games Growing "Face Rental" Trend in China short-form social media dramas technology

t f B! P L

చైనాలో ఇప్పుడు “ఫేస్ రెంటల్” అనగా ముఖాలను అద్దెకు ఇవ్వడం అనే వినూత్న ట్రెండ్ అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. డిజిటల్ మార్కెటింగ్ మరియు కంటెంట్ క్రియేషన్ రంగం శరవేగంగా చైనా అభివృద్ధి చెందుతోంది. ఏఐ యాడ్స్, సోషల్ మీడియా షార్ట్ డ్రామాలు, మరియు వీడియో గేమ్‌లలో నిజమైన నటులకు బదులుగా ఏఐతో సృష్టించిన వర్చువల్ పాత్రలను విరివిగా వాడుతున్నారు. దీనికోసం కంపెనీలు సాధారణ ప్రజల ముఖ కవళికలను, హావభావాలను కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకుని డిజిటల్ రూపంలో ఉపయోగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో గోప్యతకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ ముఖాలను ఏ వ్యాపార ప్రకటనలకు వాడాలి, ఏ ప్రచారాలకు లేదా వివాదాస్పద అంశాలకు అస్సలు వాడకూడదు అనే విషయాలపై కఠినమైన నిబంధనలతో కూడిన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కేవలం తమ అనుమతి ఉన్న పరిధులలో మాత్రమే డిజిటల్ ఫేస్‌లను ఉపయోగించేలా చట్టపరమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా సమయం, వినియోగం మరియు ప్రాజెక్ట్ పరిధిని బట్టి కొందరు సాధారణ వ్యక్తులు ఏకంగా రూ. 14 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఎలాంటి ప్రత్యేక నటన నైపుణ్యాలు లేకపోయినా, కేవలం తమ ముఖాలను డిజిటల్ ప్రపంచానికి అద్దెకు ఇవ్వడం ద్వారా ఇంత భారీ మొత్తంలో ఆదాయం వస్తుండటంతో యువత దీనివైపు ఆకర్షితులవుతున్నారు. అయితే, ఈ వినూత్న సంపాదన మార్గం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, దీనివల్ల కొన్ని భద్రతా సమస్యలు కూడా లేకపోలేదు. డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండటంతో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే క్రియేటివిటీతో పాటు భారీ ఆదాయాన్ని కూడా ఎలా సృష్టించవచ్చో ఈ “ఫేస్ రెంటల్” ట్రెండ్ స్పష్టంగా నిరూపిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ