టాటా సన్స్ ఛైర్మన్ గా వరుసగా మూడోసారి ఎన్ చంద్రశేఖరన్ కు అవకాశం కల్పిస్తూ ఈ నెల 17న బోర్డు ఓటింగ్ ద్వారా తీసుకున్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం తెలిపాయి. ఈ నిర్ణయం చెల్లుబాటును టాటా ట్రస్ట్స్ సవాల్ చేసింది. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం.. ట్రస్ట్ నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ వర్గం నుండి సానుకూల మద్దతు అవసరమని, చైర్మన్ నిర్ణయాత్మక ఓటు ఆ షరతును అధిగమించలేదని వాదించింది. దీంతో చంద్రశేఖరన్ మరోసారి ఆ పదవిలో కొనసాగే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు కొత్త పదవీకాలాన్ని టాటా సన్స్ డైరెక్టర్లు ఆమోదించినప్పటికీ, ఆ గ్రూప్ అతిపెద్ద వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ దాన్ని చట్టవిరుద్ధమని తెలిపింది. టాటా సన్స్ షేర్లలో సుమారు మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్న స్వచ్ఛంద ట్రస్టుల నెట్‌వర్క్‌కు అధ్యక్షత వహించే నోయల్ టాటా, చంద్రశేఖరన్ పదవీకాలాన్ని ఐదేళ్లపాటు పొడిగించడానికి వ్యతిరేకంగా ఏకైక ఓటు వేశారు. టాటా సన్స్ బోర్డులో టాటా ట్రస్ట్స్ నామినీ అయిన వేణు శ్రీనివాసన్ పదవీకాల పొడిగింపునకు ఆయన మద్దతు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన టాటా ట్రస్ట్, టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఎలాంటి ప్రతిష్టంభన ఏర్పడలేదని తెలిపింది. ట్రస్ట్ నామినేట్ చేసిన ఇద్దరు డైరెక్టర్లలో ఒకరు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ తీర్మానాన్ని చట్టబద్ధంగా ఆమోదించడం సాధ్యపడలేదని ట్రస్టులు ఒక ప్రకటనలో తెలిపాయి. టాటా సన్స్ బోర్డులో టాటా ట్రస్ట్ నామినీలు ఇద్దరు ఉన్నారని, ఇద్దరిలో మెజారిటీ అంటే ఇద్దరే కానీ ఒకరు కాదని క్లారిటీ ఇచ్చాయి. దీంతో చంద్రశేఖర్ పదవీకాలం పొడిగింపు అసాధ్యంగా మారనుంది.
టాటా సన్స్ ఛైర్మన్ గా మూడోసారి ఎన్ చంద్రశేఖరన్ : బోర్డు నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన టాటా ట్రస్ట్స్
الأحد، 20 سبتمبر 2026
business N. Chandrasekaran to serve third term as Tata Sons Chairman national Tata Trusts has challenged the validity of this decision Tata Trusts objects to board's decision
ليست هناك تعليقات:
إرسال تعليق