దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం జేవర్ ప్రారంభోత్సవానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన చేశారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని కల్పించబోతోంది. విమానాశ్రయం నుండి నడిచే తొలి అధికారిక విమానంలో భూమిని విరాళంగా ఇచ్చిన రైతులే మొదటి ప్రయాణికులుగా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదని, దేశ ప్రగతిలో భాగస్వాములైన అన్నదాతల సహకారాన్ని గుర్తించి, వారికి ఇచ్చే ఒక అరుదైన గౌరవ చిహ్నమని ఆయన పేర్కొన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాల పురోగతిపై సమీక్ష జరిపిన అనంతరం కేంద్ర మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.”పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో భూములిచ్చిన రైతుల పాత్ర ఎంతో విలువైంది. నోయిడా ఎయిర్‌పోర్ట్ సాకారమవ్వడానికి కారణమైన స్థానిక రైతులను గౌరవించుకోవడం మన బాధ్యత. అందుకే ఇక్కడి నుండి టేకాఫ్ అయ్యే మొదటి విమానంలో వారినే కూర్చోబెట్టి పంపాలని నిర్ణయించాం” అని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వస్తున్న ఈ రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర భారతదేశంలోనే కాకుండా, దేశ విమానయాన రంగంలోనే ఒక గేమ్ చేంజర్ కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నోయిడా రైతులకు రాయల్ గౌరవం !
الاثنين، 15 يونيو 2026
decided to have them fly on the very first flight taking off from here national Rammohan Naidu’s Announcement Special Honor for Noida Farmers Who Gave Land for Jewar International Airport
ليست هناك تعليقات:
إرسال تعليق