ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్‌ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్‌లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..'పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది. ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్‌లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి. మరోవైపు హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని ఖమేనీ కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.
గల్ఫ్ దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ హెచ్చరిక
الأربعاء، 27 مايو 2026
He declared that U.S. military bases located in the Gulf countries would no longer be safe international Iran's Supreme Leader Mojtaba Khamenei Issues Warning to Gulf Nations
ليست هناك تعليقات:
إرسال تعليق