బైజూస్‌ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్షను విధించిన సింగపూర్ కోర్టు

الأربعاء، 27 مايو 2026

'International 500 and surrender himself to court officials by May 27 fine of approximately $70 national Singapore Court Sentences Byju Raveendran to Six Months in Jail

t f B! P L


బైజూస్‌ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2024 ఏప్రిల్ నుంచి తన ఆస్తుల వివరాలను వెల్లడించే విషయంలో కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను ధిక్కరించినందుకు ఈ జైలు శిక్షను విధించింది. అలాగే 2026 మే 27 నాటికి ఆయన సుమారు 70,500 డాలర్ల జరిమానా చెల్లించి, కోర్టు అధికారుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం డెడ్‌లైన్ విధించడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్‌డీటీవీ ప్రకారం సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించిన కొన్ని గంటలకే, తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఏకపక్షంగా ఉందని బైజూస్ వ్యవస్థాపకుడు కొట్టిపారేశారు. సింగపూర్ కోర్టు వ్యవహారాన్ని తనను, ఇతర వ్యవస్థాపకులను తప్పుగా చిత్రీకరించేలా ప్రసారం చేయడంపై తాను "తీవ్ర నిరాశకు" లోనయ్యానని రవీంద్రన్ ప్రకటించారు. తన వైపు నుండి గానీ, లేదా ఇతర వ్యవస్థాపకుల వైపు నుండి గానీ ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అధికారుల ముందు లొంగిపోవాలని, 90,000 సింగపూర్ డాలర్ల చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఒక అనుబంధ సంస్థలో షేర్లను కలిగి ఉన్న 'బీఆర్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్' అనే కార్పొరేట్ సంస్థపై తనకు ఉన్న యాజమాన్య హక్కులను నిరూపించే పత్రాలను సమర్పించాలని కూడా పేర్కొంది. రుణదాతలతో ఇప్పటికే సెటిల్మెంట్ చర్చలు జరుగుతున్నందున, గత కొన్ని నెలలుగా తాను పలు కోర్టు విచారణల్లో క్రియాశీలకంగా పాల్గొనడం లేదన్నారు

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ