బహ్రెయిన్ లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో డేటా సెంటర్ లోని సర్వర్లు తీవ్రంగా దెబ్బతినడంతో గల్ఫ్ రీజియన్ అంతటా క్లౌడ్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలకు, అలాగే వారి సైనిక కార్యకలాపాలకు ఈ డేటా సెంటర్లు కీలక సమాచారాన్ని అందిస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా తమ వ్యూహాలను పసిగడుతున్నారని భావించిన ఇరాన్, నేరుగా టెక్ మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుంది. దాడి ధాటికి గల్ఫ్ దేశాల్లోని అనేక వ్యాపార, ఐటీ కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ దాడికి ముందే ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన 18 సాఫ్ట్వేర్ దిగ్గజాలను ఇరాన్ ప్రభుత్వం 'టెర్రరిస్ట్ సంస్థలు'గా ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధానంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. కేవలం ఈ ఒక్క దాడితోనే ఆగబోమని, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా టెక్ కంపెనీలన్నింటిపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కలకలం రేపుతోంది. అమెరికా, దాని మిత్రదేశాల డిజిటల్ భద్రతకు ఇది పెద్ద సవాలుగా మారింది.
ホーム
/
technology
/
అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పై ఇరాన్ క్షిపణులతో దాడి
الخميس، 2 أبريل 2026
international Iran Launches Missile Attack on Amazon Web Services Cloud Data Center Severe Disruptions to Cloud Services Across the Gulf Region technology
ليست هناك تعليقات:
إرسال تعليق