మిత్రుడి వివాహ విందుకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం : ఇద్దరు యువకుల దుర్మరణం

الخميس، 2 أبريل 2026

crime Devunuru in Dharmasagar Mandal Hanumakonda District Road Accident While Returning from Friend's Wedding Feast telangana Two Youths Tragically Die

t f B! P L


తెలంగాణలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవునూరు వద్ద బుధవారం రాత్రి మిత్రుడి వివాహ విందుకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.. మృతులను జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌కు చెం దిన ఏనుగుల లోకేశ్‌ (24), ఏనుగుల ఆశోక్‌ (22)గా గుర్తించారు. వీరిద్దరూ సొంత అన్న దమ్ములు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం తరిగొప్పుల మండలం నర్సాపూర్‌కు చెందిన ఇరుముల్ల ప్రశాంత్‌కు 20రోజుల కిందట వివా హం అయింది. ఈ క్రమంలో తన మిత్రులకు పెళ్లి విందు ఇవ్వడానికి అదే గ్రామానికి చెందిన ఇరుమల్ల నవీన్‌, ఇరుమల్ల వెంకటేష్‌, ఇరుమల్ల అజయ్‌, ఇరుమల్ల వినయ్‌, ఏనుగుల లోకేష్‌, ఏనుగుల అశోక్‌లతో కలిసి బుధవారం సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు అద్దెకు తీసుకుని వరంగల్‌ బయలు దేరారు. మొదట వీరు వరంగల్‌లోని భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం జనగామ జిల్లా చిలుపూరుకు వెళ్లారు. అక్కడ బుగులు వెంకటేశ్వరస్వా మి గుడిని కూడా దర్శించుకున్నారు. అనంతరం ధర్మసాగర్‌ మండలంలోని ముప్పారం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ విందు చేసుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఆట పాటలతో సరదాగా గడిపారు. రాత్రి సుమారు 8 గంటలకు కారులో తమ స్వగామమైన నర్సాపూర్‌కు తిరిగి బయలు దేరారు. అయితే ధర్మసాగర్‌ మండలం దేవునూరు గ్రామం సమీపంలోకి కారు రాగానే, అదుపుతప్పి మూలమలు పు వద్ద చెట్టుకు బలంగా ఢీకొన్నది. దీంతో కారులో ఉన్న ఏనుగుల లోకేశ్‌, ఏనుగుల ఆశో క్‌ అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా ఐదుగురు ఇరుముల్ల ప్రశాంత్‌ (25), ఇరుముల్ల నవీన్‌ (22), ఇరుముల్ల వెంకటేశ్‌ (22), ఇరుముల్ల అజయ్‌ (22), ఇరుముల్ల వినయ్‌ (22) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ధర్మసాగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారిలో ము గ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ