నందిగం సురేష్ పై క్రిమినల్ కేసు నమోదు

الأحد، 5 أبريل 2026

According to a complaint filed by members of the CBN-C Church Trust in Kakinada Andhra Pradesh Criminal Case Registered Against Nandigam Suresh former MP he demanded Rs 25 lakhs to complete the task

t f B! P L


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కాకినాడకు చెందిన ఒక చర్చి ట్రస్ట్ లైసెన్స్ రెన్యువల్ చేయిస్తాననని నమ్మించి, భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. కాకినాడకు చెందిన సీబీఎన్ సీ చర్చి ట్రస్ట్ సభ్యుల ఫిర్యాదు ప్రకారం 2021లో ట్రస్ట్ రెన్యువల్ ప్రక్రియ కోసం వారు అప్పటి ఎంపీ నందిగం సురేష్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఈ పని పూర్తి చేయడానికి ఆయన రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఉద్దండరాయునిపాలెం లోని సురేష్ నివాసంలోనే ఈ నగదును అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోగా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు వివరించారు. మోసంపై బాధితులు విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేష్‌పై చీటింగ్ , బెదిరింపుల కేసు నమోదు చేశారు. అయితే, కేసు ఫైల్ అయిన విషయం తెలియగానే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ