సముద్రం అంతర్భాగంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన చైనా

الأحد، 5 أبريل 2026

China Establishes Data Centers Beneath the Ocean science technology This method eliminates the need for water consumption and mitigates the risk of rising temperatures

t f B! P L


ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో అన్ని సంస్థలు డేటా సెంటర్లను విరివిగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీకి చైనా సరికొత్త పాఠాలు చెబుతోంది. సముద్రం అంతర్భాగంలో పర్యావరణహితంగా డేటా సెంటర్లను చైనా ఏర్పాటు చేసింది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల భారత్ లోని విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే ఉష్ణోగ్రతతో పాటు, భారీగా నీటి వినియోగం కూడా అవసరం పడుతుంది. వీటి పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణహితంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చైనా డేటా సెంటర్ల వల్ల ఏర్పడే ముప్పును ముందుగానే గ్రహించి ఏకంగా సముద్రం అంతర్భాగంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల నీటి వినియోగం ఉండదు. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉండదు. పైగా ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు పెద్దగా ప్రమాదం ఉండదు. అందువల్లే చైనా చాలా ముందు చూపుతో సముద్ర అంతర్భాగాలలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు ఇంటర్నెట్ కేబుళ్లు సముద్రం అంతర్భాగంలోనే ఉండేవి. ఇప్పుడు డేటా సెంటర్లను కూడా సముద్ర అంతర్భాగంలో ఏర్పాటు చేస్తూ చైనా ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు చెబుతోంది. చైనా చేసిన ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో మిగతా దేశాలు కూడా ఇదే దారిలో వెళ్తాయని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ