'ధురంధర్ 2' చిత్రం మూడో వారాంతంలో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. శుక్ర, శనివారాల్లో వసూళ్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 1600 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. హిందీ సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ చిత్రానికీ సాధ్యం కాని రీతిలో, కేవలం భారత్‌లోనే రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టేందుకు ఈ సినిమా సిద్ధమైంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన 'ధురంధర్ 2' మూడో వారం ప్రారంభం నాటికి రూ. 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. 17వ రోజైన శనివారం నాడు ఇండియాలో రూ. 25.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. శుక్రవారం నుంచి శనివారం నాటికి వసూళ్లలో 20 శాతం పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో 17 రోజుల్లో ఇండియాలో ధురంధర్ 2 సినిమా రూ. 985 కోట్ల నెట్, రూ. 1179 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మరో రెండు రోజుల్లో ఇది రూ. 1000 కోట్ల నెట్ మార్కును తాకడం ఖాయంగా కనిపిస్తోంది. విదేశాల్లోనూ ధురంధర్ 2 సినిమా ఒక సునామీలా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్‌లో (ఓవర్సీస్) 'బాహుబలి 2' పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి రికార్డును ధురంధర్ 2 తుడిచిపెట్టేసింది. రెండో వారం నాటికి అంతర్జాతీయంగా 30 మిలియన్ డాలర్లు దాటిన ఈ చిత్రం, మూడో శనివారం ఏకంగా 100 శాతం వృద్ధిని నమోదు చేసి 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 41.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 386 కోట్లు) చేరుకుంది. బాహుబలి 2కి ఓవర్సీస్‌లో వచ్చిన రూ. 371.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
మూడో వారాంతంలో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోన్న 'ధురంధర్ 2'
الأحد، 5 أبريل 2026
'Dhurandhar 2' Shows Phenomenal Growth in Its Third Weekend 600 crore mark cinema national now racing towards the ₹1
ليست هناك تعليقات:
إرسال تعليق