ఇరాన్ నుంచి ముడి చమురు నౌకలు దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భారత తీరానికి చేరుకున్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇరాన్‌కు చెందిన రెండు భారీ చమురు నౌకలు గుజరాత్‌లోని సిక్కా పోర్టులో లంగరు వేశాయి. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ రెండు నౌకలు మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం నుంచి బయలుదేరి, సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చినట్లు సమాచారం. 2019లో అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసింది. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన కొరత దృష్ట్యా అమెరికా ఆంక్షలను కొంత మేర సడలించడంతో ఈ రవాణా సాధ్యమైంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గుజరాత్‌కు చేరిన ఇరాన్ భారీ చమురు నౌకలు !
الاثنين، 13 أبريل 2026
carrying approximately 2 million barrels of crude oil international Massive Iranian Oil Tankers Arrive in Gujarat two massive Iranian oil tankers have anchored at the port of Sikka
ليست هناك تعليقات:
إرسال تعليق