కొన్ని లైక్స్, షేర్ల కోసం తన కన్నబిడ్డను ప్రాణాపాయంలోకి నెట్టాడో తండ్రి. ఆ చిన్నారి భయంతో వణికిపోతున్నా పట్టించుకోకుండా, సాహసం చేస్తున్నట్లు వీడియో తీయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక వ్యక్తి తన చిన్న కుమారుడిని ఇంటి బాల్కనీ అంచున నిలబెట్టాడు. అక్కడి నుండి కిందకు దూకమని పదే పదే ప్రోత్సహించాడు. ఆ చిన్నారి భయంతో వెనకడుగు వేస్తూ, ఏడుస్తున్నా ఆ తండ్రి కనికరించలేదు. చివరకు ఆ బాలుడు కిందకు దూకగా, తండ్రి అతడిని పట్టుకున్నాడు. ఈ మొత్తం తంతును మరొకరు కెమెరాలో బంధించారు. చిన్నారి కళ్లలో మరణ భయం కనిపిస్తున్నా, ఆ తండ్రి మాత్రం కెమెరా వైపు చూస్తూ మురిసిపోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగానే నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు. "ఇతడు తండ్రేనా లేక రాక్షసుడా?" అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులకు ఒడిగట్టే వారిపై చైల్డ్ అబ్యూస్ (బాలల వేధింపుల) కింద కఠిన కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వినోదం ప్రాణం తీసే స్థాయికి చేరడం ఆందోళనకరమని, పిల్లలకు రక్షణగా ఉండాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇలాంటి ప్రమాదకరమైన 'స్టంట్స్'ను ప్రోత్సహించకుండా, ఆ వీడియోలను వెంటనే తొలగించాలని, బాధ్యులపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని మేధావులు సూచిస్తున్నారు.
రీల్స్ కోసం బాల్కనీ నుంచి చిన్నారిని దూకమని ప్రోత్సహించిన తండ్రి : సోషల్ మీడియాలో వీడియో వైరల్
الاثنين، 13 أبريل 2026
Father Encourages Child to Jump from Balcony for 'Reels' national protectors of children are instead turning into predators technology Video goes viral on social media
ليست هناك تعليقات:
إرسال تعليق