పశ్చిమ బెంగాల్‌లోని కొంటాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లను బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మొక్కడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చారు. ఆయన వేదిక పైకి అడుగుపెట్టగానే సువేందు అధికారి వేగంగా వెళ్లి, కాషాయ కండువాతో స్వాగతం పలికారు. అంతేకాదు, ఏమాత్రం సంకోచించకుండా వేదికపైనే యోగి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే స్పందించిన యోగి ఆయనను ఆప్యాయంగా పైకి లేపి, చేయి పట్టుకుని అక్కడున్న ప్రజల వైపు తిరిగి అభివాదం చేశారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు 'ఎంత భక్తో' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన సువేందు : సోషల్ మీడియాలో వీడియో వైరల్
الاثنين، 13 أبريل 2026
Contai Assembly constituency of West Bengal national Suvendu Touches Yogi Adityanath's Feet Video goes viral on social media
ليست هناك تعليقات:
إرسال تعليق