ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో భర్త మరణించిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళను ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు, ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో ఆమెను నమ్మించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతటితో ఆగక, ఆమె నగ్న వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తూ నరకం చూపించారు. భర్త చనిపోయిన తర్వాత తన జీవనోపాధి కోసం స్థానికంగా ఉన్న ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో పని చేసేది. ఈ క్రమంలో ఆమెకు కమలేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఫ్యాక్టరీలో పని కంటే హోటల్‌లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను ప్రలోభపెట్టాడు. కమలేష్ ఆ మహిళను హోటల్ యజమాని జితేంద్రకు అప్పగించాడు. జితేంద్ర ఆమెను లోబర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కొన్నాళ్ల పాటు ఆమెతో సహజీవనం చేస్తూ ప్రతిరోజూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండానే నగ్న వీడియోలను తీసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆ వీడియోలను చూపించి, బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ తన పైశాచికత్వాన్ని కొనసాగించాడు. జితేంద్రతో పాటు కమలేష్, అతని స్నేహితులు కూడా బాధితురాలిని బంధించి, అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు నిందితుల నుంచి తపించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అరాచకాలను వివరిస్తూ న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితులు జితేంద్ర, కమలేష్‌లతో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ホーム
/
Uttar Pradesh
/
ఉద్యోగం పేరుతో ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం !
الأربعاء، 8 أبريل 2026
Acting on the complaint crime Gang Rape of a Single Woman Under the Pretext of Offering a Job Gorakhpur national the police registered a case and initiated an investigation. Uttar Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق