హైదరాబాద్ లోని జలవిహార్ వాటర్ పార్క్‌లో భారీ పేలుడు సంభవించింది. సాయంత్రం పార్క్‌లో నీటిని సరరఫరా చేసే ఆర్‌వో ప్లాంట్‌లో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు ధాటికి ప్లాంట్‌లోని పరికరాలు తునకలై చుట్టుపక్కల పడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు వారిని తోటి సిబ్బంది వారిని సమీపంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్‌వో ప్లాంట్‌లోని ఫిల్టర్లు లేదా కంప్రెషర్‌లో అధిక పీడనం ఏర్పడటమే ఈ పేలుడుకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఆర్‌వో ప్లాంట్‌లో భారీ పేలుడు : ఇద్దరికి తీవ్ర గాయాలు
الأربعاء، 8 أبريل 2026
Jalavihar Water Park in Hyderabad Massive Explosion at RO Plant pressure buildup within the filters or the compressor of the RO plant was the cause of the explosion telangana Two Severely Injured
ليست هناك تعليقات:
إرسال تعليق