ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక & గణాంకాల సంచాలకుల కార్యాలయం, ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో "నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం మరియు సంబంధిత గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్" బుధవారం విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్ ఏప్రిల్ 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గణాంక నిపుణులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వం గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ అకౌంట్స్ డివిజన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, న్యూ ఢిల్లీ సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం అంచనాలు, గణన విధానాలు, డేటా సమీకరణలో మార్పులు, సవరణలపై ఈ వర్క్‌షాప్‌లో సవివరంగా చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడం, గణాంకాల నాణ్యతను మెరుగుపరచడం ఈ వర్క్‌షాప్ ముఖ్య లక్ష్యాలుగా అధికారులు తెలిపారు.
విశాఖలో రాష్ట్ర ఆదాయ గణాంకాల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం
الأربعاء، 8 أبريل 2026
All-India Workshop on State Income and Related Statistics based on the New Base Year national National Workshop on State Income Statistics Inaugurated in Visakhapatnam
ليست هناك تعليقات:
إرسال تعليق