ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రమూలాలు కలకలం రేపుతున్నాయి. గతంలో విజయనగరంలో ఉగ్ర మూలాలు బయటపడటంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపి దేశంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి అత్యధిక మొత్తంలో నగదు ఇక్కడ వారికి అందుతుండటం, వీరు సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాద భావాజాలాన్ని ప్రోత్సహించడమే కాకుండా పాకిస్తాన్ లోని కొందరు హ్యాడర్లతో సంబంధాలున్నట్లు కూడా ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ముగ్గురికి ఒక ప్రార్థనా మందిరంలో పరిచయం ఏర్పడి ఈ భావాజాలానికి ముగ్గురు ఆకర్షితులై పాకిస్తాన్ హ్యాండర్లతో సంబంధాలు పెట్టుకున్నారని ఇంటలిజెన్స్ అధికారుల విచారణలో వెల్లడయింది. ఉగ్రవాద భావ జాలాన్ని నింపుతూ ఒక వర్గానికి చెందిన యువకులను గుర్తించి వారిలో ఉగ్రవాద భావాజాలాన్ని నింపి వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిపై కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు వారిని విచారించారు.మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహ్మద్ డానిష్ లు అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ స్టా గ్రాంతో పాటు టెలిగ్రాం ద్వారా యువతను ఉగ్రవాద భావాజాలం వైపు మళ్లిస్తున్నారని అనుమానించి గత కొంతకాలంగా వీరిపై నిఘాపెట్టిన అధికారులు చివరకు అదుపులోకి తీసుకున్నారు. వీరికి హైదరాబాద్ లోని ఒక మహిళతో కూడా ఈ విషయంలో సంబంధాలున్నాయని కూడా గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం అరెస్టు చేశారు. సయీదా బేగంను అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.పాక్ నుంచి నిధులు...నిధులు వీరికి పాకిస్తాన్ నుంచి అందుతున్నట్లు కూడా ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఉగ్రవాద నియామకాలతో పాటు, జీహాదీ కార్యక్రమాల కోసం యువతను ఎంపిక చేయడానికి వీరు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో సంబంధాలు పెట్టుకుని గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారని కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఇప్పటికే వీరి ప్రచారానికి ఆకర్షితులైన వారు ఎవరు? అన్న కోణంలో విచారించిన పోలీసులు ఆ దిశగా త్వరలో ఎన్ఐఏకు కూడా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. సాధారణ జీవితం గడుపుతూ ర్యాపిడో డ్రైవర్ గా ఒకరు, ఓలా బైక్ డ్రైవర్ గా మరొకరు, బిర్యానీ దుకాణంలో క్యాషియర్ గా మరొకరు పనిచేస్తూ ఎవరికి అనుమానం రాకుండా దేశంతో పాటు ఇతర దేశాల్లో పలువురితో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిసింది. పేలుడు పదార్థాల తయారీపై కూడా వీరు ఇంటర్నెట్ లో శోధించినట్లు పరిశోధనలో వెల్లడయింది. వీరి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరు పర్చగా ముగ్గురికి రిమాండ్ విధించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ వీరికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే వీరిని మరోసారి కస్టడీకి కోరే అవకాశాలున్నాయి.
ホーム
/
Three Arrested
/
విజయవాడలో ఉగ్ర మూలాలు ? : ముగ్గురు అరెస్ట్
الأربعاء، 25 مارس 2026
and Mohammed Danish Andhra Pradesh crime Mirza Sohail Baig Mohammed Rahmathullah Sharif Terror Links in Vijayawada? Three Arrested
ليست هناك تعليقات:
إرسال تعليق