'పెద్ది' షూటింగ్‌లో హీరో రామ్‌చరణ్‌కు గాయం

الأربعاء، 25 مارس 2026

cinema currently underway on a massive set in Hyderabad Hero Ram Charan Injured During 'Peddi' Shoot sustained a minor injury near his eye during the shoot

t f B! P L


రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో   'పెద్ది' సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో రామ్‌ చరణ్‌ కంటి సమీపంలో చిన్న గాయమైనట్లు సమాచారం. అయితే, ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదని, కేవలం చిన్న దెబ్బేనని చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. వైద్యుల సూచన మేరకు చరణ్‌ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చరణ్‌ కు గాయం కావడంతో 'పెద్ది' షూటింగ్‌ కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. కొన్ని రోజులపాటు చిత్రీకరణను నిలిపివేసి, చరణ్‌ కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న విరామం వల్ల విడుదల తేదీపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఉన్న భారీ స్టార్‌ కాస్ట్‌, టెక్నీషియన్స్‌. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, మృణాల్‌ ఠాకూర్‌ ఒక ప్రత్యేక గీతంలో అలరించనున్నారు. శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ అద్భుతమైన స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబఅందం ప్లాన్‌ చేస్తోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ