తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. అయితే డిఎంకె నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమికి పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం త్యాగం కాదని బాధ్యత అని అన్నారు. మంగళవారం డిఎంకెతో సీట్ల సర్దుబాటు చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టార్చ్‌లైట్ గుర్తుకు బదులుగా డిఎంకె పార్టీకి చెందిన 'ఉదయించే సూర్యుడు' గుర్తుపై పోటీ చేయమని కోరినట్లు తెలిపారు. సీట్ల పంపంకంపై డిఎంకెతో రెండు దశల్లో చర్చలు జరిగాయని, సిఎం స్టాలిన్, డిప్యూటీ ఉదయనిధి సహా డిఎంకె కమిటీ తమను గౌరవం, ఆదరణతో చూసుకున్నారని అన్నారు. అయితే తమ పార్టీకి కేటాయించిన సీట్ల సంఖ్య, డిఎంకె పార్టీ గుర్తుపై పోటీ చేయాలన్న వారి ప్రతిపాదన తనకు, అలాగే తమ పార్టీకి ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయితే ఈ ప్రతిపాదన వెనుక డిఎంకె కారణాలను తాము అర్థం చేసుకున్నామని, మతతత్వ శక్తులు తమిళనాడును స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న తరుణంలో, లౌకిక ప్రగతిశీల కూటమి విజయం అత్యంత ప్రధానమని అన్నారు. 'టార్చ్‌లైట్' గుర్తు పార్టీ కార్యకర్తలకు ఒక భావోద్వేగమని, ఇది కేవలం గుర్తు మాత్రమే కాదని, తమ ఉనికి కూడా అని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా తనకు మద్దతుగా ఉన్న వారి మనోభావాలను విస్మరించలేనని అన్నారు. తమిళనాడు హక్కులను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్న సమయంలో ఒక సోదరుడిగా, తన వాటా సీట్లను పంచుకోవడం సబబుకాదని అన్నారు. ఇది త్యాగం కాదని కర్తవ్యమని , స్వార్థం కాదు సహనమని అన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలకు ద్రవిడ నమూనా 2.0 అత్యవసరమని అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అభినందనలు తెలిపేందుకు ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో తాను తప్పకుండా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
మా పార్టీ పోటీ చేయడంలేదు : ఎంపి కమల్‌హాసన్
الأربعاء، 25 مارس 2026
announced that they would extend their full support to the DMK MP Kamal Haasan Our Party Will Not Contest Tamil Nadu assembly elections
ليست هناك تعليقات:
إرسال تعليق