తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ఏఐఏడీఎంకే తొలి జాబితా విడుదల

الأربعاء، 25 مارس 2026

AIADMK Releases First List K. Palaniswami is entering the electoral fray once again from his home constituency released its first list of 23 candidates Tamil Nadu assembly elections

t f B! P L


మిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఏఐఏడీఎంకే 23 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో పైచేయి సాధించే వ్యూహాన్ని పళనిస్వామి అమలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్‌) తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని 'ఎడ్పాడి' నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. తొలి జాబితాలో పార్టీలోని హేమాహేమీలకు ఏఐఏడీఎంకే పెద్దపీట వేసింది. సీనియర్ నాయకులు కేపీ మునుసామి, దిండిగల్ సి. శ్రీనివాసన్, నథమ్ ఆర్. విశ్వనాథన్ వంటి కీలక నేతలు తమ పాత స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. పశ్చిమ తమిళనాడుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బలమైన నేతలుగా పేరున్న ఎస్పీ వేలుమణి (తోండముత్తూరు), పి. తంగమణి (కుమారపాళయం) నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన తొలి పార్టీగా ఏఐఏడీఎంకే నిలిచింది. ఇప్పటికే సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' (ఎన్‌టీకే) అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ప్రధాన కూటముల్లో మాత్రం ఏఐఏడీఎంకేనే అందరికంటే ముందుగా అడుగు వేసింది. కేవలం 23 స్థానాలకే ప్రస్తుతం జాబితా పరిమితమైనా, కీలక నేతలందరినీ ముందే రంగంలోకి దించడం ద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ