తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ఏకంగా బస్సులోనే బ్రష్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం పూట బస్సు ఖాళీగా ఉండటంతో ఒక మహిళ కిటికీ పక్కన సీటులో కూర్చుని నిశ్చింతగా బ్రష్ చేయడం మొదలుపెట్టింది. పళ్లు తోముకుంటూ కిటికీలోంచి బయటకు ఉమ్మివేస్తుండటం చూసి తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఇది గమనించిన మహిళా కండక్టర్ సదరు ప్రయాణికురాలిని నిలదీశారు. "బస్సులోనే బ్రష్ చేస్తారా?" అని ప్రశ్నించగా ఆ మహిళ చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. "అంతా ఫ్రీయే కదా" అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. అంతటితో ఆగకుండా.. "అరె రామశంకరా, నేను ఛాయ్ కూడా తాగాలి. బస్సు ఆపుతావా?" అంటూ కండక్టర్‌కే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. మహిళ ప్రవర్తనను చూసి తోటి ప్రయాణికులు తమ మొబైల్‌లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
బస్సులో బ్రష్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన మహిళ : వైరల్ అవుతున్న వీడియో
السبت، 7 مارس 2026
RTC bus going from Maddimadugu in Padara mandal of Nagarkurnool telangana Video goes viral Woman surprised everyone by brushing her teeth in the bus
ليست هناك تعليقات:
إرسال تعليق