ఇజ్రాయెల్ తోపాటు తన పొరుగుదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ ఇరాన్‌కు హెచ్చరిక చేశారు. ఇరాన్ తన తర్కాన్ని వాడాలని, పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని గార్గాష్ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఒక తప్పుడు లెక్క అన్నారు. ఈ చర్య ఇరాన్‌ను క్లిష్టమైన సమయంలో ఒంటరిని చేసిందని చెప్పారు. 'మీ యుద్ధం మీ పొరుగువారితో కాదు' అని వ్యాఖ్యానించారు. తర్కాన్ని వాడి మీ స్థితికి కారణం తెలుసుకోండి. 'ఒంటరితనం అనే వలయం మరింత ఎక్కువగా విస్తరించకముందే మీ పొరుగువారితో హేతుబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించండి' అని అన్వర్ గార్గాష్ సూచించారు.
మీ యుద్ధం మీ పొరుగువారితో కాదు : అన్వర్ గార్గాష్
الأحد، 1 مارس 2026
Anwar Gargash diplomatic advisor to the UAE president He called Iran's attacks on the Gulf countries a miscalculation Your war is not with your neighbors
ليست هناك تعليقات:
إرسال تعليق