ఖమేనీ మృతిని 'సినికల్ మర్డర్'గా అభివర్ణించిన పుతిన్

الأحد، 1 مارس 2026

international Putin calls Khamenei's death a 'cynical murder' Putin wrote a letter to Iranian President Masoud Peshkian to this effect

t f B! P L


ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత కఠిన పదజాలంతో స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను 'సినికల్ మర్డర్'గా అభివర్ణించిన పుతిన్, ఇది అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేయడమే కాకుండా, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ ఓ లేఖ రాశారు. ఖమేనీని రష్యాలో అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా గుర్తుంచుకుంటామని, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని ఆ లేఖలో కొనియాడారు. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ సైనిక అధికారులు మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ