పాదచారులపైకి దూసుకెళ్లిన డీటీసీ బస్సు : ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

الاثنين، 9 مارس 2026

Angry locals vandalized and tried to burn the bus that caused the accident DTC bus runs over pedestrians: Two dead in Delhi's Nangloi area many injured

t f B! P L


ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో డీటీసీకి చెందిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయి ప్రమాదానికి కారణమైన బస్సును ధ్వంసం చేసి, దహనం చేసేందుకు ప్రయత్నించారు. బస్సు వేగంగా వెళ్తూ స్కూటీపై వెళ్తున్న ఒక యువకుడిని, అలాగే ఇ-రిక్షా కార్మికుడిని, మరికొందరిని ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న యువకుడిపైకి బస్సు ఎక్కడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అలాగే మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు గాయపడ్డట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడి ఆందోళనకారులను చెదరగొట్టారు. ధ్వంసమైన బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రుల్ని స్థానిక సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ