బెంగళూరులోని నందిని లేఅవుట్ ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల పాండురంగకు ఇన్‌స్టాగ్రామ్‌లో 27 ఏళ్ల సుమలత పరిచయమైంది. పెళ్లై ఇద్దరు కుమారులున్న ఆమె తన భర్తను వదిలేసింది. దీంతో పాండురంగ, సుమలత కలిసి ఏడాది పాటు సహజీవనం చేశారు. వారికి కుమార్తె పుట్టింది. అయితే గొడవల వల్ల వారిద్దరూ విడిపోయారు. కాగా, ఇంటి పనులు చేస్తున్న సుమలత తన తల్లిదండ్రులతో కలిసి తారబనహళ్లి ప్రాంతంలో నివసిస్తున్నది. మార్చి 6న సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమలత ఇంటికి పాండురంగ వచ్చి ఆమె స్కూటీ తాళం ఇవ్వమని అడిగాడు. సుమలత నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సుమలత తల్లిదండ్రులు జ్యోకం చేసుకున్నారు. దానితో పాండురంగ బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్‌ను సుమలత, ఆమె తల్లిదండ్రులపై పోసి నిప్పంటించి పారిపోయాడు. కాలిన గాయాలైన ఆ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన పాండురంగను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీ ఇచ్చేందుకు నిరాకరించిందని పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి !
الاثنين، 9 مارس 2026
Bengaluru crime karnataka Man sets himself on fire after refusing to give him a scooty Nandini Layout area Sumalatha poured petrol in a bottle brought by Panduranga on her parents on fire and fled
ليست هناك تعليقات:
إرسال تعليق