కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. 1943 అక్టోబరు 1న జన్మించిన కావూరి వరంగల్ నీట్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. కాంగ్రెస్ నుంచి ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన సాంబశివరావు మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. మన్మోహన్ కేబినెట్‌లో జౌళి శాఖకు కేంద్రమంత్రిగా వ్యవహరించారు. 2013లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా 2014లో కాంగ్రెస్‌ను వీడారు. తన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనని ప్రకటించి బీజేపీలో చేరారు.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
الاثنين، 9 مارس 2026
Andhra Pradesh Former Union Minister Kavuri Sambasiva Rao Passes Away Minister for Textiles in the Manmohan Singh cabinet studied higher education in Warangal NEET telangana
ليست هناك تعليقات:
إرسال تعليق