ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయం కాదు : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

السبت، 26 سبتمبر 2026

Chief Election Commissioner Gyanesh Kumar must resign Minister Uttam Kumar Reddy telangana The Election Commission is not a BJP office

t f B! P L

దేశంలో ఎన్నికల ప్రక్రియలో 'రిఫరీ'పైనే అనుమానం కలిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం స్వతంత్రతే పునాది అని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రత కోసం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయం కాదని ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వ ఆస్తినో, అధికార పార్టీ సొత్తో కాదని కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు దేశ ప్రజల రాజ్యాంగ హక్కు అన్నారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ రాజకీయ పరికరంగా మార్చే ప్రయత్నాన్ని సహించమన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ప్రధాని సూచించిన కేంద్ర మంత్రిని కమిటీలో చేర్చి బీజేపీ మెజారిటీని ఖాయం చేసుకుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆనాడు లేవనెత్తిన సందేహాలే నేడు దేశ ప్రజల ప్రశ్నలయ్యాయని ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి లేవనెత్తినట్లు చెబుతున్న 14 అభ్యంతరాలపై సమాధానం చెప్పాలన్నారు. గోవాలో 97 మంది అర్హుల పేర్లు తుది జాబితాలో చేరకపోవడం తీవ్ర ఆందోళనకరం అని చట్టబద్ధ అధికారి అర్హత నిర్ధారించినా సాఫ్ట్‌వేర్ ఓటు హక్కును అడ్డుకోవడమేమిటి అని నిలదీశారు. గోవా ఉదంతానికి బాధ్యులెవరో ఎన్నికల సంఘం దేశ ప్రజలకు వెల్లడించాలన్నారు. ఓటర్ల సంఖ్య 97 కావచ్చు. సంఖ్య చిన్నదైనా హక్కు చిన్నది కాదన్నారు. ఒక్క అర్హుడి ఓటు హక్కును అడ్డుకున్నా అది ప్రజాస్వామ్యంపై దాడేనని మనిషి కోసం సాంకేతికత ఉండాలి తప్పా సాంకేతికత కోసం ఓటు హక్కును బలి ఇవ్వొద్దన్నారు. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్ల తొలగింపుపై పారదర్శకత అవసరం అని పశ్చిమ బెంగాల్‌లో 22.21 లక్షల మంది పేర్ల పునరుద్ధరణకు అప్పీలు చేయడం చిన్న విషయం కాదన్నారు. ఎన్నికల తర్వాత పేరు సరిచేస్తే ప్రయోజనం ఏమిటి? ఓటింగ్‌కు ముందే న్యాయం జరగాలన్నారు. రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ ఇచ్చినట్లు ఎన్నికల తర్వాత ఓటు హక్కును పునరుద్ధరించడం ఏంటని ప్రశ్నించారు. 'అన్ని నిర్ణయాలు ఏకగ్రీవం' అనే ఒక్క మాటతో కమిషనర్ల అభ్యంతరాలు మాయమైపోవని వివాదాస్పద నిర్ణయాలను ఎవరు అనుమతించారో ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలన్నారు. గోవా ఘటనతోపాటు ఓటరు జాబితాల సాంకేతిక వ్యవస్థపై నిష్పాక్షిక విచారణ జరపాలని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎన్నికల ప్రక్రియను నమ్మాలని ప్రజలను ఆదేశించలేరన్నారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ