ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ ఇస్తాడోనని భయంతో నిద్రిస్తున్న తండ్రిని కుమారుడు కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. కుంతనహాల్ గ్రామానికి చెందిన నన్నేసాబ్ (47)కు మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, నన్నేసాబ్ రెండో భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో కుటుంబంలో ఆస్తి చిచ్చు మొదలైంది. రెండో భార్యకు పుట్టబోయే సంతానానికి కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని, తండ్రి తన వాటా తగ్గించేస్తాడని మొదటి భార్య పెద్ద కుమారుడు నూర్ మహమ్మద్ గత కొంతకాలంగా అనుమానంతో వున్నాడు. నూర్ మహమ్మద్ తన తండ్రి నన్నేసాబ్‌ను ఆస్తి పంపకాలు చేయాలని గత కొన్ని రోజులుగా నిలదీస్తున్నాడు. దీనిపై నన్నేసాబ్ స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న ఆస్తి కుటుంబ పెద్దల పేరు మీద ఉందని, తన అన్నదమ్ములు ఆస్తి భాగాలు పంచుకున్న తర్వాత తనకు వచ్చే వాటా నుండి కుమారులకు న్యాయం చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, తండ్రి మాటలను నూర్ మహమ్మద్ నమ్మలేదు. తండ్రి తనను మోసం చేస్తున్నాడని, ఆస్తి మొత్తం రెండో భార్య సంతానానికి ఇచ్చేస్తాడని భావించి కక్ష పెంచుకుని తండ్రిని కడతేర్చాడు.
ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన కొడుకు !
الثلاثاء، 31 مارس 2026
Andhra Pradesh crime Kunthanahal village located in the Kouthalam Mandal of Kurnool district Son Kills His Own Father Over Property Dispute
ليست هناك تعليقات:
إرسال تعليق