తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు ఏప్రిల్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) తమ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెకు ముందుగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా, సోమవారం నాడు అఫ్జల్‌గంజ్ విద్యుత్తు డివిజన్ (సిటీ-8) కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం మరియు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు తమ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 8 నుంచి ఆర్టిజన్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె
الثلاثاء، 31 مارس 2026
Statewide Indefinite Strike by Artisan Employees Starting April 8 Telangana's power sector Under the aegis of the TVAEE JAC
ليست هناك تعليقات:
إرسال تعليق