దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరైన పి.ఆర్. రమేష్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. ఆయన బోర్డులో సభ్యుడిగానే కాకుండా, ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న పి.ఆర్. రమేష్, గతంలో డెలాయిట్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశారు. డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం పి.ఆర్. రమేష్ ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కొనసాగుతున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును అందుకున్నారు. సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా ఉండి, దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ, "ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకొని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. రమేష్ గారి అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. పి.ఆర్. రమేష్ స్పందిస్తూ "డిజిటల్ రంగంలో VerSe అద్భుతమైన స్థాయికి చేరుకుంది. సంస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ జవాబుదారీతనం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి వ్యవస్థలు కూడా అదే స్థాయిలో పటిష్టంగా ఉండాలి. బాధ్యతాయుతమైన వృద్ధి దిశగా మేనేజ్‌మెంట్ టీంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు.
ホーム
/
technology
/
'VerSe Innovation' ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్.రమేష్ నియామకం
الثلاثاء، 31 مارس 2026
Artificial Intelligence-based local language technology platform business national P.R. Ramesh Appointed as Independent Director at 'VerSe Innovation' technology
ليست هناك تعليقات:
إرسال تعليق