గోరు వెచ్చని నీరు - ఆరోగ్య ప్రయోజనాలు

السبت، 7 مارس 2026

arogyam ayurvedam Digestion improves flushes out toxins from the body health natural cleanser Warm Water - Health Benefits

t f B! P L


ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు తీసుకోవటం అలవాటు. ఆయుర్వేదం ప్రకారం రోజూ మనం గోరు వెచ్చని నీళ్లను తాగటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గోరు వెచ్చని నీళ్లను ఉదయం పరగడుపునే తాగితే సహజసిద్ధమైన క్లీన్సర్‌లా పనిచేస్తాయి. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు సైతం శుభ్రంగా మారుతాయి. మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఏ కాలంలో అయినా గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, పరిస్థితిని బట్టి చల్లటి నీరు లేదా వేడి నీరు తాగాలి. సాధారణంగా మరిగించి చల్లార్చిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తలలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, గొంతులో మంట, గరగర వంటి సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. దీంతో ఎంతో ఉపశమనం లభిస్తుంది. పేగులకు రక్తప్రవాహం పెరుగుతుంది. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే, 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని పొట్ట చలనశీలత కోసం తీసుకోవడం మంచిది. 50 నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి లక్షణాలను తగ్గించడానికి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా వేడి నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవయవాలకు ఆక్సిజన్ మరింత సమర్థవంతంగా అందుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మనం సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగు తుంది. నిల్వ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అయితే, ఉదయం పూట వేడి నీటిని తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మనం తాగే నీరు 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్న నీటిని తాగడం వల్ల నాలుక సున్నితమైన పొర దెబ్బతింటుంది. దంతాలపై ఉండే ఎనామిల్ కాలక్రమేణా బలహీనపడుతుంది. వేడి నీరు కొందరిలో యాసిడ్ రిఫ్లెక్స్ ను పెంచుతుంది. ఖాళీ కడుపుతో తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పలుచగా అవుతాయి. వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి, జీర్ణ వ్యవస్థకు మంచిదే అయినప్పటికీ నీటిని తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ