ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు

السبت، 7 مارس 2026

10 divisional committee members 130 Maoists surrender in the presence of Chief Minister Revanth Reddy 40 area committee members handed over 124 weapons national three state committee members

t f B! P L


తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్, బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ కి 130 మంది మావోయిస్టులు నాలుగు  ప్రత్యేక బస్సుల్లో చేరుకుని 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి, జన జీవన స్రవంతిలో కలిశారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ లొంగుబాటుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన 130 మందిలో 125 మంది ఛత్తీస్‌గఢ్, నలుగురు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు  ఉన్నారు. గతంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, అహింసా మార్గాన్ని ఎంచుకుని వీరంతా లొంగిపోతున్నట్లు డీజీపీ తెలిపారు. వీరిలో ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం. మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా భావించే పీఎల్‌జీఏ బెటాలియన్ మొత్తం ప్రభుత్వానికి లొంగిపోయింది. అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి వంటి కీలక నేతల గన్‌మెన్లు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు పార్టీకి సాంకేతిక విభాగంలో కీలకంగా పనిచేసే కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దేవ్‌జీకి చెందిన పూర్తి పీఎల్‌జీఏ కమిటీ సరెండర్ కావడంతో అడవిలో మావోయిస్టుల నెట్‌వర్క్ దాదాపుగా తుడిచి పెట్టుకుపోయినట్లయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొంగిపోయిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారికి ప్రభుత్వం తరపున అందించే పునరావాస ప్యాకేజీలు మరియు ఇతర సదుపాయాలపై భరోసా ఇచ్చారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ