ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్తబురుజు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు ప్రయోజనాల దృష్ట్యా వివాదాస్పద 'ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని' రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. భూ రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పక్కాగా పట్టాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో పాసు పుస్తకాల విషయంలో నెలకొన్న గందరగోళానికి స్వస్తి పలుకుతూ కొత్త టెక్నాలజీతో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనివల్ల రికార్డుల భద్రత పెరగడమే కాకుండా.. ఫోర్జరీకి అవకాశం ఉండదని తెలిపారు. ఒక్క పైసా కూడా అవినీతికి తావులేకుండా పట్టాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూ వివాదాలు , రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాతే కొత్త పాసు పుస్తకాలను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో జరిగిన తప్పుల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు జరగకుండా రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
الاثنين، 9 مارس 2026
Andhra Pradesh CM Chandrababu distributed new pattadar pass books with QR code gram sabha organized in Kothaburuj village tour of Nandyal district
ليست هناك تعليقات:
إرسال تعليق