పంచాయతీల పునర్ వర్గీకరణకు ప్రభుత్వం ఆమోదం

الثلاثاء، 10 مارس 2026

Andhra Pradesh Government approves reclassification of panchayats orders of Chief Minister Nara Chandrababu Naidu three types of panchayats that existed till now have now been divided into four

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం, గ్రామీణ ప్రాంతాలలో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా పంచాయతీల పునర్ వర్గీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న పంచాయతీ వర్గీకరణ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్మెంట్ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఈ మార్పుల్లో ముఖ్యమైన అంశం 'రూర్బన్ పంచాయతీ' అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టడం. రూరల్ మరియు అర్బన్ లక్షణాలు కలిసిన పెద్ద గ్రామాలను గుర్తిస్తూ ఈ కేటగిరీని రూపొందించారు. పట్టణాల మాదిరిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రూర్బన్ పంచాయతీ విధానం ప్రకారం 10 వేల కంటే ఎక్కువ జనాభా మరియు రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 5 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాలకు ఈ కేటగిరీ వర్తిస్తుంది. ఈ పంచాయతీలలో రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నారు.

3 వేల నుంచి 10 వేల మధ్య జనాభా మరియు రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి లోపు వార్షిక ఆదాయం ఉన్న గ్రామాలు గ్రేడ్-1 పంచాయతీలోకి వస్తాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే 2,500 నుంచి 5 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలు ఈ కేటగిరీలో చేరుతాయి. ముఖ్యంగా మండల కేంద్రంగా ఉన్న గ్రామాలు ఎక్కువగా ఈ గ్రేడ్‌లో ఉంటాయి.

2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-2 కేటగిరీలో చేర్చారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 1,500 నుంచి 2 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలు ఈ వర్గంలోకి వస్తాయి. చిన్న గ్రామాలకు అవసరమైన ప్రాథమిక అభివృద్ధి పనులను ఈ కేటగిరీలో ప్రాధాన్యతగా చేపడతారు.

1,500 కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాలను గ్రేడ్-3 పంచాయతీలుగా గుర్తించారు. జనాభా తక్కువగా ఉండే ఈ గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త వర్గీకరణతో పంచాయతీల అభివృద్ధి పనులు మరింత ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీకి ఉన్న జనాభా, ఆదాయం, అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాల్లో పెరుగుతున్న మౌలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డిజిటల్ సేవలు, గ్రామ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద గ్రామాలకు ఈ కొత్త రూర్బన్ పంచాయతీ వ్యవస్థ కీలకంగా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ