దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతను అరికట్టడానికి, సరఫరాను క్రమబద్ధీకరించడానికి దేశవ్యాప్తంగా అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అవసరమైతే మరో ఏడాది పొడిగించవచ్చు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం, కృత్రిమ కొరతను సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయించడం ఈ చట్టం కింద నేరాలు. ఎస్మా చట్టం కింద నిబంధనలు మీరే వారిని పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ప్రొపేన్, బ్యూటేన్ వంటి ముడి పదార్థాలను అందించాలని, ప్రైవేట్ పెట్రోకెమికల్ సంస్థలకు వీటిని ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది.బుకింగ్ పరిమితిని ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం 21 నుండి 25 రోజులకు పెంచింది. వ్యాపార అవసరాల కంటే ఇళ్లలో వాడే సిలిండర్ల సరఫరాకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోని రిఫైనరీలన్నీ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, ఇతర పెట్రోకెమికల్స్ తయారీని తాత్కాలికంగా ఆపాలని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ వంటి దేశాల నుండి భారత్‌కు వచ్చే ముడి చమురు మరియు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. 2024-25లో భారత్ 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వాడగా, అందులో కేవలం 12.8 మిలియన్ టన్నులు మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యింది. మిగిలిన 85-90% దిగుమతులు హోర్ముజ్ జలసంధి ద్వారానే రావాలి, ఇప్పుడు ఆ మార్గం మూతపడటంతో కొరత ఏర్పడింది.
గ్యాస్ సిలిండర్ల కొరత : దేశవ్యాప్తంగా అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని అమలులోకి తెచ్చిన కేంద్రం
الثلاثاء، 10 مارس 2026
Centre implements Emergency Services Management Act across the country Gas Cylinder Shortage national violation of the rules will lead to imprisonment of 3 to 7 years
ليست هناك تعليقات:
إرسال تعليق