ఇరాన్‌పై దాడులకు 'ఉక్రెయిన్‌' డ్రోన్లు !

الأحد، 8 مارس 2026

'Ukrainian' drones for attacks on Iran international technology which is the specialty of Ukrainian drones work with the help of AI

t f B! P L


ఇరాన్ ప్రయోగిస్తున్న చౌక డ్రోన్లను కూల్చడానికి అమెరికా ప్రస్తుతం ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తోంది. చౌకడ్రోన్లతో ఇరాన్ చేస్తున్న దాడులతో అగ్రరాజ్యం అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ను సాయం కోరాల్సి వచ్చింది. ఇరాన్ చౌక డ్రోన్లను కూల్చడానికి ఉక్రెయిన్ డ్రోన్లను ఇవ్వాలని ఉక్రెయిన్ ను అమెరికా రిక్వెస్ట్ చేసింది. రష్యాతో యుద్ధం సాగిస్తున్న ఉక్రెయిన్ తన దగ్గర ఉన్న డ్రోన్లతో రష్యాకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ మోరాప్సాగా పేర్కొనే ఇంటర్ సెప్టర్ డోన్లను విజయవంతంగా వినియోగించింది. దీనికోసం వాటి పనితీరును కూడా పరీక్షించింది. ఈ క్రమంలో సదరు ఇంటర్ సెప్టర్లు సమర్థవంతంగా పనిచేస్తాయని నిర్ధారణ అయింది. దీంతో వాటిని వినియోగించి ఇరాన్ చౌక డ్రోన్లపై ప్రయోగించాలని నిర్ణయించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఇంటర్ సెప్టర్లు ఇతర డ్రోన్లపై సమర్థవంతంగా దాడి చేయగలవని వారు భావిస్తున్నారు. వాటిని ఓ మధ్యతరహా ట్రక్కు వెనుక భాగంలో అమర్చడానికి కూడా అవకాశం ఉంటుందన్నారు. అమర్చిన తర్వాత వాటికి సమీపంలోకి ఎలాంటి డ్రోన్లు వచ్చినా వాటిని డ్రోన్లను గుర్తించి, వాటిని కూల్చేయగలవు. అలాగే.. ఉపగ్రహ సిగ్నళ్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు జామ్ అయినప్పుడు ఇవి ఏఐ సాయంతో పనిచేయగలవని తెలిపారు. అందుకే ఉక్రెయిన్ డ్రోన్లను ఈ యుద్ధంలో వినియోగించాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ చౌక డ్రోన్లను కూల్చాడానికి ఉక్రెయిన్ డ్రోన్లను ఇవ్వాలని అమెరికా కోరడంతో -- సాయం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హమీ ఇచ్చారు. కాగా ఈ డ్రోన్లు-- శాటిలైట్ సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ జామ్ అయినా.. AI సాయంతో పనిచేయడం ఉక్రెయిన్ డ్రోన్ల స్పెషాలిటీ. ప్రస్తుతం 30 లక్షల విలువచేసే ఇరాన్ డ్రోన్లను కూల్చడానికి.. అమెరికా రూ-- 30కోట్ల విలువైన మిస్సైల్స్ను వాడుతుంది. దీంతో అమెరికా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధంలో ఇరాన్ కంటే వందల రెట్లు అమెరికా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అమెరికా దగ్గర మరో వారానికి మాత్రమే సరిపోను నిల్వలు ఉండటంతో ఆయుధ ఉత్పత్తి, ఇతర దేశాల సాయంపై ట్రంప్ ఫోకస్ పెట్టారు. దీనికోసం ఇతర దేశాలు వినియోగిస్తున్న ఆయుధాలను అమెరికా తీసుకోవడానికి సిద్ధపడుతోంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ