'క్లాడ్' ఏఐ టూల్ నుంచి కాపీ-పేస్ట్ : లాజిక్ వివరించలేకపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ : సోషల్ మీడియాలో వైరల్‌

الأحد، 8 مارس 2026

Copy-paste from AI tool 'Cloud' science Software engineer unable to explain logic team leader shared it on the platform 'X' technology viral on social media

t f B! P L


ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను రాసిన (ఏఐ సాయంతో) కోడ్‌ను వివరించలేక తోటి ఉద్యోగుల ముందు అభాసుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో డెవలపర్లు తాము రాసిన కోడ్‌ను రివ్యూ కోసం 'పుల్ రిక్వెస్ట్' రూపంలో సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన డెవలపర్ ఒక ఫంక్షన్‌కు సంబంధించిన కోడ్‌ను తన టీమ్ లీడర్‌కు పంపాడు. ఆ కోడ్ అద్భుతంగా పని చేస్తోంది. ఎటువంటి ఎర్రర్స్ లేవు. అయితే ఆ కోడ్ వెనుక ఉన్న లాజిక్‌ను వివరించాల్సిందిగా సీనియర్ ఎడిటర్ కోరడంతో అసలు విషయం బయటపడింది. ఆ డెవలపర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరకు తల దించుకుని తాను ఆ కోడ్‌ను 'క్లాడ్' అనే ఏఐ టూల్ నుంచి నేరుగా కాపీ-పేస్ట్ చేశానని తెలిపాడు. ఈ ఉదంతాన్ని సదరు టీమ్ లీడర్ 'ఎక్స్' వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. 'అతనికి కోడింగ్ రాదని కాదు, కానీ తాను స్వయంగా రాయకపోవడం వల్ల అందులోని లాజిక్‌ను విశ్లేషించలేకపోయాడు. ఏఐ ఇచ్చింది, పంపేశాడు అంతే!' అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ పుల్ రిక్వెస్టుల్లో ఏఐ ప్రమేయం ఉంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్టాక్ ఓవర్‌ఫ్లో వంటి వెబ్‌సైట్ల నుంచి గతంలో కోడ్ తీసుకునేవారని, కానీ అప్పట్లో కనీసం ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని సీనియర్లు గుర్తుచేస్తున్నారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ