ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం ఐదో బెటాలియన్‌లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. సూర్యనారాయణ మూర్తి (34) తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేవలం నాలుగు రోజుల క్రితమే ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ బాధను తట్టుకోలేకనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సమయానికే ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వారంలోజుల్లోపే తల్లి, కొడుకు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. సహోద్యోగులు, బెటాలియన్ సిబ్బంది ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తల్లి మరణాన్ని తట్టుకోలేక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య
الاثنين، 23 مارس 2026
5th Battalion in Vizianagaram Andhra Pradesh APSP Constable Commits Suicide crime M. Suryanarayana Murthy Unable to Bear Mother's Death
ليست هناك تعليقات:
إرسال تعليق