హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. QVSE ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే నెలకు లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పి, అదే కాలనీకి చెందిన వెంకటేశ్వర అప్ప అనే వ్యక్తి పలువురి నుంచి పెట్టుబడులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసినట్లు బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడులు తీసుకున్నారని, తొలుత యాప్‌లో డాలర్ల రూపంలో లాభాలు చూపించి అనంతరం యాప్‌ను క్లోజ్ చేశారని ఆరోపించారు. మరింత పెట్టుబడి పెడితే మొత్తం నగదు తిరిగి వస్తుందని చెప్పడంతో పాటు, ప్రశ్నించిన బాధితులను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.
హైదరాబాద్ లో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం !
الاثنين، 21 سبتمبر 2026
claim that while the app initially displayed profits in dollars cyber Crime Hayathnagar it was subsequently shut down Massive Online Trading Scam in Hyderabad QVSE Online Trading telangana
ليست هناك تعليقات:
إرسال تعليق