దుబాయ్‌ డ్రాలో గోల్డ్‌ మెర్సిడెస్‌ కారును గెలుచుకున్న శ్రీలంక వాసి సుమిత్

الخميس، 26 فبراير 2026

000 dinars bought gold biscuits with 15 international prize worth 50 times more than his investment Sri Lankan Sumit wins gold Mercedes car in Dubai draw

t f B! P L


దుబాయ్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్  15 వేల దీనార్లతో (సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్‌లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్‌ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అతనికి అదే తొలిసారి కూడా. తాను పెట్టిన  పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి అతనిని వరించింది. ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంతో సుమిత్‌ ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు. 20ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న సుమిత్‌ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్‌ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్‌ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్‌ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. ఒకరోజు నైట్‌ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు ఉపక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్‌ కాల్‌ వచ్చింది. మెయిల్‌ చెక్‌ చేసుకోండి అని చెప్పారు. చెక్‌ చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ